జగిత్యాల డిపోలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని 200 మంది కార్మికులు డిపో మేనేజరు వద్దకు చేరారు. తాము సమ్మె విరమిస్తున్నామని.. విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజరు జగదీశ్వర్‌ను కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో సాధ్యం కాదని డిపో మేనేజరు సూచించడం వల్ల కార్మికులు వెనుతిరిగారు. కనీసం తాత్కాలికంగా విధుల్లో చేర్చుకోవాలని కార్మికులు డిపో మేనేజరును వేడుకున్నారు. ఆయన విధుల్లో చేర్చుకోనందున ఆవేదనతో కార్మికులు వెనుతిరిగి వెళ్లిపోయారు.
విధుల్లో చేరతామని డిపో మేనేజర్ వద్దకు ఆర్టీసీ కార్మికులు - tsrtc
జగిత్యాల డిపోలో 200 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని డిపో మేనేజరును వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని... చేర్చుకోవడం సాధ్యం కాదని చెప్పడంతో కార్మికులు ఆవేదనతో వెనుదిరిగారు.
విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు