తెలంగాణ

telangana

ETV Bharat / state

Rtc drivers: ప్రైవేట్​ టీచర్ల మాదిరిగా ఆర్థిక సాయం అందించాలి

కరోనాతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల ప్రైవేటు​ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రైవేట్​ టీచర్లకు అందిస్తున్న భృతి మాదిరిగా తమకు కూడా అందించాలని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కోరారు.

rtc drivers protests in metpally
మెట్​పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

By

Published : May 28, 2021, 2:52 PM IST

ఆర్టీసీ అద్దె బస్సుల ప్రైవేటు డ్రైవర్లను ఆదుకోవాలంటూ జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ బస్టాండ్​లో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. కరోనా లాక్​డౌన్​తో బస్సులు నడవక ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డామని వాపోయారు. దీంతో కుటుంబ పోషణ భారమైందని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద కుటుంబాలకు చెందిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రైవేటు టీచర్లకు అందిస్తున్న భృతి మాదిరిగా తమకు కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:పాఠశాల విద్య పర్యవేక్షణకు.. కమాండ్‌ సెంటర్‌

ABOUT THE AUTHOR

...view details