జగిత్యాల జిల్లాలో జగిత్యాల డిపోతో పాటు మెట్‌పల్లి, కోరుట్ల డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోల పరిధిలో 230 బస్సులు ఉండగా రోజూ లక్షా పదివేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. జగిత్యాల జిల్లాలో ఏడాది కాలంలోనే పార్శిళ్ల ఆర్డర్లు బాగానే పెరిగాయి.
జిల్లాలో మూడు డిపోల పరిధిలో ప్రతి నెల పది లక్షల వరకు ఆదాయం వస్తుండగా ఈ మూడు డిపోల్లో రోజూ 30 టన్నుల వరకు సరుకులను చేరవేస్తోంది. పార్శిల్ అందించిన కొద్ది గంటల్లోనే ఆయా ప్రాంతాలకు చేరటంతో వినియోగదారులు కార్గో కొరియర్ (Cargo) సర్వీసులను వినియోగించుకుంటున్నారు.