తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించిన ఆర్‌ఎం, అదనపు కలెక్టర్‌ - ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించిన ఆర్‌ఎం, ఆదనపు కలెక్టర్‌

జగిత్యాలలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. రెండు కార్గో బస్సులను జిల్లా అదనపు కలెక్టర్​ బి.రాజేశం, కరీంనగర్​ ఆర్​ఎం జీవన్​ప్రసాద్​ ప్రారంభించారు. ఈ బస్సుల వల్ల రవాణా ఇబ్బందులు తప్పనున్నాయని అధికారులు తెలిపారు.

rtc cargo buses started in jagityal
ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించిన ఆర్‌ఎం, ఆదనపు కలెక్టర్‌

By

Published : May 16, 2020, 12:55 PM IST

జగిత్యాలలో ఆర్టీసీ కార్గో సేవలను అదనపు కలెక్టర్‌ బి. రాజేశం, కరీంనగర్‌ ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ ప్రారంభించారు. జగిత్యాల సివిల్‌ సప్లై గోదాం నుంచి రెండు బస్సుల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నారు. ఈ బస్సులతో ప్రభుత్వ సబ్సిడి బియ్యం, విత్తనాలు, ఎరువులను సరఫరా చేయనున్నారు.

కార్గో సేవలు అందుబాటులోకి రావటం వల్ల జిల్లాలో రవాణా ఇబ్బంది తప్పనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని కార్గో సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ తెలిపారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ABOUT THE AUTHOR

...view details