నిరుపేదలు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించాలని.. వారిని ప్రయోజకులను చేసే బాధ్యత తమదని రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటలో ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
'గురుకులాల్లో చేర్పించండి.. ప్రయోజకులను చేస్తాం' - రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్తలు
గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నిరుపేద పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాలు ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు.

'గురుకులాల్లో చేర్పించండి.. ప్రయోజకులను చేస్తాం'
నిరుపేద, అట్టడుగు వర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాలు ప్రవేశపెట్టిందన్నారు. అంబేడ్కర్ గ్రంథాలయంతోపాటు గ్రామ అభ్యసన కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఇదీ చూడండి: 'చందాల పేరుతో దందాలు'