రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలికి గాయాలు - dhee
అన్నాచెల్లెలు రాయికల్‌లో పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా వారిని మోపెడ్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించటంతో కరీంనగర్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.
మోపెడ్‌ను ఢీకొన్న ట్రాక్టర్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పు మడుగు వద్ద మోపెడ్‌ను ట్రాక్టర్ ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన అన్నా చెల్లెలు కోటయ్య, గంగుగా గుర్తించారు. రాయికల్ మండలంలో పెళ్లికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.