జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెల్గొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ కేంద్రానికి చెందిన ముదురుకోళ్ల నర్సయ్య(45) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును ఒక్కసారిగా ఆపడం వల్ల ద్విచక్ర వాహనంపై వస్తున్న నర్సయ్య బస్సును వెనుక నుంచి ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం అయ్యి నర్సయ్య అక్కడికక్కడే మరణించాడు.
సడన్ బ్రేక్.. ఒకరు మృతి - రోడ్డుప్రమాదం తాజా వార్త
జగిత్యాల జిల్లా వెల్గొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సును ఆపడం వల్ల వెనుకనుంచి వస్తున్న ద్విచక్ర వాహనం బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
సడన్బ్రేక్.. ఒకరు మృతి
ద్విచక్ర వాహనంపై వెనుకాల కూర్చున్న ఆయన కోడలు వనితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే నర్సయ్య మృతి చెందాడని వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలకి చేరుకుని విచారణ చేపట్టారు.