జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక టిప్పర్‌ను ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
మంచిర్యాల జిల్లా కుందారం నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండకు ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ పంక్చర్ అయింది. రహదారి పక్కను నిలిపి మరమ్మతు చేస్తుండగా... రామగుండం నుంచి నాందేడ్ వెళ్తున్న ఇథనాల్ ట్యాంకర్ టిప్పర్‌ను ఢీకొట్టింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మృతుడు నాందేడ్‌కు చెందిన విజయ్‌గా పోలీసులు గుర్తించారు.
నడిరోడ్డుపై టిప్పర్ డ్రైవర్ సజీవదహనం - జగిత్యాలలో ప్రమాదం
జిగిత్యాల జిల్లా నేరేళ్ల జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ సజీన దహనమయ్యాడు.
నడిరోడ్డుపై టిప్పర్ డ్రైవర్ సజీవదహనం
ఇవీ చూడండి: నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం