తెలంగాణ

telangana

ETV Bharat / state

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...

ఓ ఆలోచన.. రైతుల కష్టాలు తీర్చింది. రోజంతా పడే కష్టాన్ని ఇట్టే పోగొట్టింది. పండించిన ధాన్యాన్ని  బియ్యంగా మార్చేందుకు సమయం ఆదా చేసింది. కాలు బయటపెట్టకుండా.. పని పూర్తి చేసే యంత్రం ఇప్పుడు వారి ఇంటి ముందుకే వస్తోంది.

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...

By

Published : Sep 24, 2019, 6:55 AM IST

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...

పండించిన పంటను బియ్యంగా మార్చుకోవడానికి నిత్యం రైస్​మిల్లు వద్ద రైతులు అవస్థలు పడుతున్నారు. వారి వ్యథను చూసిన జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం మారుతీనగర్​కు చెందిన జక్క సుభాష్... ఓ వినూత్న ఆలోచన చేశాడు. జార్ఖండ్ నుంచి మినీ రైస్ మిల్ యంత్రాన్ని 4లక్షల 80 వేలకు కొనుగోలు చేశాడు.

గంటకు 15 క్వింటాళ్ల ధాన్యం మర...

ఈ మినీరైస్ మిల్ యంత్రం రైతుల ఇంటికే తీసుకెళ్లి.. అక్కడే బియ్యంగా మారుస్తుంది. ఒక్కఫోన్ కాల్ చేస్తే చాలు ఈ మొబైల్ రైస్​మిల్ రైతు ఇంటి వద్దకే వస్తుంది. ఇందుకోసం క్వింటా​కు 150 రూపాయలు ఖర్చవుతుంది. తవుడు వద్దనుకుంటే ఆ ఖర్చూ లేదు. గంటలో 15 క్వింటాళ్ల ధాన్యాన్ని బియ్యంగా మార్చే సత్తా ఈ యంత్రానిది. ఇందుకు అయ్యే ఖర్చు 5 లీటర్లు మాత్రమే. మిల్లు వద్దకు పోయే బాధ తప్పడంతో.. ఈ మినీ రైస్​మిల్​కు ఆదరణ బాగానే ఉంది. ఈ మినీ రైస్​మిల్ ఆలోచన రైతుల కష్టం తీర్చడమే కాదు.. సుభాష్​కు జీవనోపాధిని కల్పించింది.

ఇవీచూడండి: చెల్లెలికి పండగ కానుక... బతుకమ్మ చీర

ABOUT THE AUTHOR

...view details