జగిత్యాల జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ ఊపందుకుంది. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలతో పాటు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పురపాలికల పరిధిలో పంపిణీ కొనసాగుతోంది. తొలిరోజు కొన్ని ప్రాంతాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైనప్పటికీ... ఏర్పాట్లలో జాప్యం జరిగింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో నేటి నుంచి పంపిణీ ప్రారంభించారు. ఉదయం 30 మందికి, సాయంత్రం 30 మందికి బియ్యాన్ని అందజేస్తున్నారు. లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీశారు. ఒకేసారి గుంపులా రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
లబ్ధిదారులందరికీ బియ్యం...ఆందోళన వద్దు