కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మిస్తున్న రివర్స్ పంపింగ్ పనులు తుది దశకు చేరాయి. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. నిర్మాణాలను కలెక్టర్ డా. శరత్ పరిశీలించారు. మొత్తం 8 మోటర్లకు ఇప్పటికే మూడింటిని డ్రై రన్ నిర్వహించామని.. మరో మోటార్ డ్రై రన్‌కు సిద్ధంగా ఉందని తెలిపారు.
రాంపూర్ రివర్స్ పంపింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్ - collector sarath
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద చేపడుతున్న నిర్మాణాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎల్లంపల్లి వరకు చేరిన నేపథ్యంలో.. మిగతా ప్రాంతాల్లోనూ నీటిని ఎత్తిపోసే కార్యక్రమం పూర్తయితే లక్ష్మిపూర్ వరద కాలువలోకి నీరు చేరనుంది. అక్కడ నుంచి రాంపూర్ కాలువకు నీరు చేరుతుంది. రాంపూర్‌లో ఎత్తిపోసిన నీరు రాజేశ్వర్‌రావుపేటకు.. అక్కడ నుంచి జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎత్తిపోయనున్నారు. సకాలంలో వరదకాలవలోకి నీరు చేరితే .. కాలువకు వెంట ఉన్న 60 చెరువులను మందుగా నింపుతామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: భూ నిర్వాసితుల గోడు వినండి: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు