తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని కేసీఆర్‌.. దేశంలో బాగు చేస్తారా?: రేవంత్‌రెడ్డి - Revanth Reddy fires on KCR latest news

Revanth Reddy Fires on KCR: సీఎం కేసీఆర్​పై​ రేవంత్​రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని కేసీఆర్‌.. దేశంలో బాగు చేస్తారా అని ప్రశ్నించారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే అర్హత ముఖ్యమంత్రికి లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ.. ఇద్దరూ మోసం చేసేవారే అని ఆయన దుయ్యబట్టారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Mar 11, 2023, 3:22 PM IST

Updated : Mar 11, 2023, 3:52 PM IST

Revanth Reddy Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పండిన పంటను ప్రభుత్వం కొనట్లేదని విమర్శించారు. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్లే అని సీఎం అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని ముఖ్యమంత్రి.. దేశంలో బాగు చేస్తారా అని నిలదీశారు. జగిత్యాల జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే అర్హత లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని సీఎం భావిస్తున్నారని విమర్శించారు. మోదీది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కాదని.. ట్రబుల్‌ ఇంజిన్‌ సర్కార్​ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ.. ఇద్దరూ మోసం చేసేవారే అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే.. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయ మోడల్‌ను అమలు చేస్తాం: రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయ మోడల్‌ను అమలు చేస్తామని రేవంత్​రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా ముత్యంపేటలో చక్కెర కర్మాగారంపై మూసివేతపై.. రైతులను కలుసుకుని ఆయన వివరాలు సేకరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేసి.. ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలను దెబ్బతీశారని ఆరోపించారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు.

రూ.3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో.. చక్కెర కర్మాగారాన్ని నడపలేరా?: ఇదే జరిగితే తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమేనని రేవంత్​రెడ్డి విమర్శించారు. రూ.3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా అని ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్​కు రేవంత్​ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన.. బీఆర్​ఎస్​ పాలనపై చర్చ పెడదామని తెలిపారు. తమది రైతులను ఆదుకునే విధానమని.. బీఆర్ఎస్​ది రైతు ఆత్మహత్యల విధానమని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం:ఈడీ అనుకుంటే గంటలోపే కల్వకుంట్ల కవితను జైలుకు పంపించవచ్చని రేవంత్​రెడ్డి తెలిపారు. అదాని విషయం బయటకు వచ్చినప్పుడల్లా.. కేంద్రం దిల్లీ మద్యం కుంభకోణాన్ని బయటకు తీస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమని విమర్శించారు. బీఆర్​ఎస్​ ఆందోళన చేస్తే.. బీజేపీ కూడా రోడ్డెక్కుతుందని పేర్కొన్నారు. ఇదంతా ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ అని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

"కేసీఆర్‌.. రైతులకు అన్యాయం చేస్తున్నారు. పండిన పంటను కేసీఆర్‌ ప్రభుత్వం కొనట్లేదు. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్లే అని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని సీఎం.. దేశంలో బాగు చేస్తారా?. కేసీఆర్‌కు అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే అర్హత లేదు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. మోదీది డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదు.. ట్రబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌. రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ.. ఇద్దరూ మోసం చేసేవారే.తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారు." -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో రైతులను బాగు చేయలేని కేసీఆర్‌.. దేశంలో బాగు చేస్తారా?: రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి:చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

DRDOలో చేరతారా? బీకాం, బీఎస్సీ డిగ్రీ ఉందా?.. మీకోసమే ఈ నోటిఫికేషన్!

Last Updated : Mar 11, 2023, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details