తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్గటూరులో పునరావాస ప్రజావేదిక.. ఆగ్రహించిన స్థానికులు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

జగిత్యాల జిల్లా వెల్గటూరులో జిల్లా అదనపు పాలనాధికారి రాజేశం, ఆర్డీవో మాధురి పునరావాస ప్రజావేదికను నిర్వహించారు. విధివిధానాలను ప్రకటించకముందే ప్రజావేదికను నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Resettlement Public Forum in Velgatur .. Outraged Locals
వెల్గటూరులో పునరావాస ప్రజావేదిక.. ఆగ్రహించిన స్థానికులు

By

Published : Jul 11, 2020, 8:15 AM IST

కాళేశ్వరం లింక్​-2 ప్రాజెక్టు పంప్​హౌస్ నిర్మాణానికి సంబంధించి జగిత్యాల జిల్లా వెల్గటూరులో జిల్లా అదనపు పాలనాధికారి రాజేశం, ఆర్డీవో మాధురి పునరావాస ప్రజావేదికను నిర్వహించారు. బాధిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు.

భూములను తీసుకునే ముందు విధివిధానాలను ప్రకటించక ముందే ఏకపక్షంగా ప్రజావేదికను నిర్వహించడంపై రాజక్కపల్లె, వెల్గటూరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగబోయే నష్టాన్ని గుర్తించి.. అధికారులు వ్యవరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై గవర్నర్‌ చర్చ

ABOUT THE AUTHOR

...view details