జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు హతమార్చారు. భార్య చనిపోవడం వల్ల కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బలో రాజారెడ్డి ఒంటరిగా నివసిస్తూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇంట్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య - హత్య
భూ వివాదాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు మృతుడి ఇంట్లోనే హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
ఇంట్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు.