పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు జగిత్యాల జిల్లా గొల్లపల్లి నుంచి మహారాష్ట్రకు వ్యాన్‌లో తరలించే ప్రయత్నం చేశారు. ఆ వాహనాన్ని మేడిపల్లి వద్ద పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. వ్యాన్‌తో పాటు బియ్యాన్ని జగిత్యాలకు తరలించారు. పట్టుకున్న బియ్యం 80 క్వింటాళ్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు డీఎస్‌వో తెలిపారు.
జగిత్యాలలో 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - స్వాధీనం
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జగిత్యాలలో అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 80 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
జగిత్యాలలో 80క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత