తెలంగాణ

telangana

ETV Bharat / state

నాచుపల్లిలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5లక్షలు పరిహరం అందజేత - raitu bheema Compensation given to the nachupally farmer families

జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ రూ. 5లక్షల చొప్పున పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు కేసీఆర్​ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

raitu bheema Compensation given to the nachupally farmer families by mla ravishankar
నాచుపల్లిలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5లక్షలు పరిహరం అందజేత

By

Published : Jul 28, 2020, 6:21 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన రైతులు చెప్యాల దుర్గయ్య, రాయనవేణి నర్సయ్యల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. రైతులది సహజ మరణమే అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా చెల్లిస్తుందని ఆయన తెలిపారు.

రైతు కుటుంబాల్లో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థకు రూ.3 వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకే సీఎం అనేక చర్యలు చేపడుతున్నారన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details