జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కురిసిన ఆకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మండలంలోని కొండాపూర్, భీమారం, రంగాపూర్, దేశాయిపేట, గోవిందారం గ్రామాల్లో భారీ వర్షం కురియటంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.
అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం - తడిసిన ధాన్యం
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కురిసిన వర్షానికి వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.
వర్షం
భారీగా వీచిన గాలితో మామిడి కాయలు రాలిపోయి నష్టం వాటిల్లింది. వరి ధాన్యం నీటి ప్రవహానికి కొట్టుకుపోయింది. ఇంకా కోత పూర్తి కానీ వరి పంట పడిపోయినట్లు రైతులు తెలిపారు.. తడిచిస ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:నేడు మేయర్, ఛైర్మన్ల ప్రమాణస్వీకారం