జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ రాజేశంతోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరయ్యారు. పీవీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.
జగిత్యాలలో పీవీ నరసింహారావు జయంతి వేడుకలు - pv narasimha rao birth anniversary
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జగిత్యాలతో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని పీవీ సేవలను కొనియాడారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగిత్యాలలో ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి వేడుకలు
దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలను నాయకులు కొనియాడారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నివాసంలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించారు. పీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి చేసిన సేవలను జీవన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.