తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రయాణికులకు వీలుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు' - special buses provide for jagityal passingers by tsrtc

జగిత్యాల ఆర్టీసీ డిపోను కరీంనగర్​ రవాణ శాఖ డిప్యూటి కమిషనర్​ పుప్పాల శ్రీనివాస్​, ఆర్​ఎం జీవన్​ ప్రసాద్​ పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు జీవన్​ ప్రసాద్​ తెలిపారు.

'ప్రయాణికులకు వీలుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు'

By

Published : Oct 13, 2019, 6:33 PM IST

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ ఆర్ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు. జగిత్యాల ఆర్టీసీ డిపోను కరీంనగర్ రవాణ శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్​తో కలిసి ఆయన పరిశీలించారు. బస్సుల పరిస్థితిని, ప్రయాణికుల ఇబ్బందుల అడిగి తెలుసుకున్నారు. బస్​పాస్​లను బస్సుల్లో అనుమతిస్తున్నామని.. ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తామన్నారు. అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, బస్సులు తనిఖీలు చేస్తున్నామని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు.

'ప్రయాణికులకు వీలుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు'

ABOUT THE AUTHOR

...view details