తెలంగాణ

telangana

ETV Bharat / state

బండి సంజయ్​పై దాడిని నిరసిస్తూ భాజపా నాయకుల ధర్నా - jagityal district protest

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​పై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం జగ్గసాగర్​ గ్రామంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్​ డౌన్​డౌన్​ అంటూ తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

bjp leaders protest at jagityal district
బండి సంజయ్​పై దాడిని నిరసిస్తూ భాజపా నాయకుల ధర్నా

By

Published : Oct 27, 2020, 2:20 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం జగ్గసాగర్​ గ్రామంలో భాజపా నాయకులు ధర్నాకు దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​పై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగారు. కేసీఆర్​ డౌన్​డౌన్​ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దుబ్బాక నియోజకవర్గంలో తెరాస ఓడిపోతుందేమోననే భయంతో భాజపా అభ్యర్థి ఇంట్లో దాడులకు పాల్పడుతున్నారని భాజపా నాయకులు ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునిపై దాడి చేయడం విచారకరమని పేర్కొన్నారు.

ఇదీ చదవండిఃదుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

ABOUT THE AUTHOR

...view details