తెలంగాణ

telangana

జగిత్యాలలో నేడు నమూనా పోలింగ్​ కేంద్రం ప్రారంభం

By

Published : Apr 4, 2019, 5:50 AM IST

Updated : Apr 4, 2019, 11:34 AM IST

ఈ ఎన్నికల్లో నిజామాబాద్​ది ప్రత్యేక స్థానం. అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ఓటేసే వారికి అవగాహన కోసం జగిత్యాల కలెక్టర్​ నమూనా పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇవాళ ఎన్నికల అధికారులు ప్రారంభించనున్నారు.

ఈవీఎం

మోడల్​ పోలింగ్​ కేంద్రాలు ప్రారంభించనున్న ఎన్నికల అధికారులు
ఓటర్లను చైతన్య పరిచేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్​ డాక్టర్​ శరత్​ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంతో పాటు, కోరుట్ల పట్టణంలో మోడల్​ పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారులు వీటిని ప్రారంభించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా.. పోలింగ్​ కేంద్ర నమూనా చిత్రాలను ప్రదర్శించనున్నారు. యూ ఆకారంలో 12 ఓటింగ్​ యంత్రాలతో పాటు, వీవీ ప్యాట్​లను అందుబాటులో ఉంచారు. వీటిపై ఓటర్లకు అవగాహన కల్పించనున్నారు.

కవిత సందర్శన

జగిత్యాలలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెరాస ఎంపీ కవిత నమూనా పోలింగ్​ కేంద్రాన్ని పరిశీలించారు. అభ్యర్థుల జాబితా, వీవీప్యాట్​ యంత్రాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి :'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'

Last Updated : Apr 4, 2019, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details