జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, అదనపు ఎస్పీ సురేశ్ ఈవేడుకల్లో పాల్గొని విధినిర్వహణలో ప్రాణాలర్పించిన రక్షరభటులకు నివాళులర్పించారు.
'విధినిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యని పోలీసులకు సెల్యూట్' - latest news of police Martyrs' Day celebrations in jagtial
శాంతిభద్రతల పరిరక్షణకై అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ఎనలేనివని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి కొనియాడారు. పోలీసు కార్యాలయంలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అమరులకు నివాళులర్పించారు.
'విధినిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యని పోలీసులకు సెల్యూట్'
వారిసేవలను గుర్తు చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని, పోలీసుల సేవలు మరువరానివని కలెక్టర్ కొనియాడారు.
ఇదీ చూడండి:పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి