తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనాదారులు నిర్లక్ష్యం.. పోలీసుల లాఠీ హెచ్చరిక - కరోనా నివారణ చర్యలు

జగిత్యాలలో లాక్​డౌన్​ కర్ఫ్యూని పోలీసులు కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై లాఠీఛార్జ్​ చేస్తున్నారు.

police-lati-charge-on-two-wheelers-due-to-lock-down-kurfew-at-jagtial
వాహనాదారులు నిర్లక్ష్యం.. పోలీసుల లాఠీ హెచ్చరిక

By

Published : Mar 27, 2020, 5:06 PM IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం పోలీసులు ఎంతో నిబద్ధతతో తమ విధులను నిర్వహిస్తున్నారు. జగిత్యాలలో లాక్‌డౌన్‌ను పోలీసులు పగడ్బందీగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే యువకులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు.

వాహనాదారులు నిర్లక్ష్యం.. పోలీసుల లాఠీ హెచ్చరిక

పట్టణంలోని కొత్త బస్టాండ్‌ చౌరస్తాలో కొందరు యువకులు ఎంత హెచ్చరించినా పదేపదే రోడ్లపై తిరగటం వల్ల పోలీసులు వారి లాఠీలకు పని చెప్పారు. అవసరముంటేనే బయటకి రావాలని అనవసరంగా రోడ్లపైకి ఎవరు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details