జగిత్యాల జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపై, వీధుల్లో తిరిగే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని భవాని నగర్‌లో లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించి క్రికెట్ ఆడుతోన్న వారిని పట్టుకుని ఐసోలేషన్‌కు తరలించారు.
పోలీసుల న్యూ ప్లాన్.. బయటికొస్తే ఐసోలేషన్‌కు తరలింపు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి భరతం పడుతున్నారు జగిత్యాల పోలీసులు. కరోనా సోకుతుందని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్న వారికి సరైన గుణపాఠం చెబుతున్నారు. నియమాలు ఉల్లంఘించి.. బహిరంగ ప్రదేశాల్లో క్రికెట్ ఆడుతోన్న యువకులను పట్టుకుని ఐసోలేషన్‌కు తరలించారు.
lockdown in jagtial
అత్యవసరమైతే తప్ప.. ఎవరు బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.