జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిని ముట్టడిస్తామని భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు అభివృద్ధి పనులపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి పర్యటించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. రామమందిర నిధి సేకరణపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భాజపా, తెరాస మధ్య వివాదం నెలకొంది. ఫలితంగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని భాజపా పిలుపునిచ్చింది.
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటి వద్ద పటిష్ఠ బందోబస్తు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటి ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామమందిర నిధి సేకరణపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించాలని భాజపా పిలుపునిచ్చింది. కోరుట్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి పర్యటించనున్నారు.
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటి వద్ద పటిష్ఠ బందోబస్తు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పోలీసులను భారీగా రప్పించారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ముందస్తుగా బందోబస్తును ఏర్పాటు చేసి... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఇటు మంత్రుల పర్యటన అటు ఎమ్మెల్యే ఇంటి ముట్టడితో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:'ఎస్సీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి'