మెట్పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు - pochamma bonalu celebrations at metpally in jagitial district
ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెట్పల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చివరి ఆదివారం కావడం వల్ల పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
- ఇదీ చూడండి : తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా