కొవిడ్ బారిన పడి మృతి చెందిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల తెరాస అధ్యక్షుడి కుటుంబానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలో పార్టీ అభివృద్ధికి రాఘవరెడ్డి చేసిన కృషి మరువలేనిదని వినోద్ కుమార్ అన్నారు.
తెరాస నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ - jagtial news
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల తెరాస అధ్యక్షుడు రాఘవరెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. రాఘవరెడ్డి గత నెల కరోనా బారిన పడి కన్ను ముశారు. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
condolences to trs leader family
క్రమశిక్షణ కలిగిన మంచి నాయకుడిని కోల్పోయామన్న ఎమ్మెల్యే.. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్‌తో 27 మందికి సీరియస్