మంచిర్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మట్టి తొలగించే క్రమంలో తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్ పగిలింది. దాదాపు 20 నిమిషాల పాటు.. మంచినీరు వృధాగా పారింది.
పగిలిన పైప్‌లైన్.. తాగునీరు వృధా! - పైప్‌లైన్ లీకేజ్
మెట్పల్లి పురపాలక పరిధిలో కాంట్రాక్టర్ ఉత్సాహం కొన్నివార్డులకు మంచినీరు లేకుండా చేసింది. రోడ్డు విస్తరణ పేరుతో మట్టి తీస్తుండగా మంచినీటి పైప్‌లైను పగిలింది.

పగిలిన పైప్‌లైన్.. తాగునీరు వృధా!
సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే తాగునీటి సరఫరా నిలిపివేసి.. పైప్‌లైన్‌కు మరమ్మత్తులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పగిలిన చోట మరోపైపు అమర్చి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఒకరోజు సమయం పడుతుందని అప్పటి వరకు కొన్ని వార్డుల్లో తాగునీటి సరఫరా ఉండదని తెలిపారు.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియాలో వికారాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి