తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 12:16 PM IST

ETV Bharat / state

నెమలి నాట్యం చూద్దాం రండి...

నెమలి నాట్యమాడుతుంటే చూడాలి ఎవరికుండదు. మయూరి నాట్యమంటే ఎవరికైన ఇష్టమే. జగిత్యాల జిల్లా కొలువాయిలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్న దృశ్యాలను గ్రామస్థులు చరవాణిల్లో బంధించారు.

Peacock dancing
నెమలి నాట్యం

అడవిలో ఉండే నెమలి రోజు గ్రామంలోకి వచ్చి నాట్యం చేస్తే చూపరులకు ఎంత ఆనందమో కదా.. అలాంటి దృశ్యమే జగిత్యాల జిల్లాలో ప్రతి రోజు దర్శనమిస్తోంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం చిన్న కొలువాయిలో ఓ మయూరం రోజు అడవి నుంచి వచ్చి గ్రామ వీధుల్లో నాట్యం చేసి వెళ్తోంది.

నెమలి నాట్యం

తరచు వస్తున్నా ఆ నెమలితో గ్రామస్థులు కాలక్షేపం చేస్తున్నారు.. మనుషులు దానికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకపోవటంతో రోజు గ్రామంలోకి వచ్చి ఉల్లాసంగా కాసేపు గడిపి అడవులోకి వెళుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రోజు పురివిప్పే చేసే మయూర నాట్యాన్ని గ్రామస్థులు వారి చరవాణుల్లో బంధించారు.

ఇదీ చదవండి:జడ్చర్ల, అచ్చంపేటలో ఊపందుకోనున్న ప్రచారం

ABOUT THE AUTHOR

...view details