జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొలువాయి గ్రామంలోకి ఓ మయూరం అడవి నుంచి వచ్చి జనం ముందే నాట్యం చేసింది. అడవిలో ఉండాల్సిన నెమలి జనం మధ్యలోకి వచ్చి పురివిప్పి నాట్యం చేయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. చరవాణిలో దృశ్యాలను బంధించారు. నెమలి చాలా సేపు జనం మధ్యే ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి చూశారు.
పురివిప్పిన నెమలి నాట్యం.. ఇదిగో వీడియో..
నెమలి పురి విప్పి నాట్యం చేసింది. ఓ గ్రామంలో అందరి ముందు... మయూరి నాట్యం చేసింది. ఆ అందాల దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ అందమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
పురివిప్పిన నెమలి నాట్యం.