తెలంగాణ

telangana

ETV Bharat / state

300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత - రేషన్​ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు.

pds rice seized in jagitial distrct
300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Aug 11, 2020, 10:18 PM IST

పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రెవెన్యూ అధికారులకు దొరికిపోయాడు ఓ రైస్ మిల్ వ్యాపారి.జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ ఇండస్ట్రీస్​లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వచేశారన్న సమాచారాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా... స్థానిక తహసీల్దార్ గణేష్ ఇండస్ట్రీస్​లో తనిఖీలు నిర్వహించారు.

మూడు గోదాంలలో నిల్వచేసిన సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. యజమానిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి తరలించారు.

ఇవీ చూడండి: కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌..

ABOUT THE AUTHOR

...view details