తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమం - పట్టణప్రగతిలో పాల్గొన్న మున్సిపల్​ ఛైర్​పర్సన్​ సుజాత వార్తలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పురపాలిక ఛైర్​పర్సన్​ సుజాత పాల్గొని.. ప్రజలకు పలు సూచనలు చేశారు.

pattana pragathi program at metpalli in jagtial district
మెట్​పల్లిలో పట్టణప్రగతి కార్యక్రమం

By

Published : Jun 1, 2020, 12:55 PM IST

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మెట్​పల్లి పురపాలిక ఛైర్​పర్సన్​ సుజాత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలిక పరిధిలోని పలు వార్డుల్లో అధికారులు పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటించిన ఆమె.. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలతో పాటు తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం రూపొందించాలని తెలిపారు.

ఇదీ చదవండి: సగటు తీసి.. స్లాబ్‌ లెక్కిస్తారు

ABOUT THE AUTHOR

...view details