రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయడానికి జగిత్యాల జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వీడియో కాల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
వీడియోకాల్ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన - జగిత్యాలలో వీడియోకాల్ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ వీడియోకాల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికోసం ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి అధికారుల పనితీరును పరిశీలిస్తున్నారు.
వీడియోకాల్ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన
ఈ కాల్సెంటర్లో పని చేసే 10 మంది సిబ్బంది ప్రతిరోజు... పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు వీడియో కాల్ చేసి పని తీరుని నమోదు చేస్తారు. ఏ రోజు ఎన్ని పనులు చేశారో రికార్డు చేస్తారు.
రెండో విడతలో చేపట్టే పనులను మరింత పడ్బందీగా కొనసాగేలా ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.