జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు మధ్య అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే విధంగా సంఘం ఎన్నికలు నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఓటరు రాగానే లోనికి తీసుకెళ్లడం.. పోలింగ్ బూత్ చూపించడం.. ఆధార్ కార్డు చూపించిన వారికి జాబితాలో పేరు చూసిన అనంతరం ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి నియమనిబంధనలు ఉన్నాయో సంఘం ఎన్నికల్లో కూడా అలాంటి నిబంధనలను ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య నిర్వహించడం విశేషం. పోటీలో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా వాడివేడిగా ఎన్నికలు జరిగాయి.
అసెంబ్లీ ఎలక్షన్ల మాదిరి పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు - మెట్పల్లిలో పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు
ఎన్నికల అధికారులు, పోలింగ్ చిట్టీలు, పోలింగ్ బూతులు, ఎన్నికల ఏజెంట్లతో పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలను పటిష్ఠంగా నిర్వహించారు. ఏంటి ఇప్పుడేం ఎన్నికలు అని అనుకుంటున్నారా? అవునండి.. జగిత్యాల జిల్లాలో పద్మశాలి సేవా సంఘం ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు, మెట్పల్లి
ఫలితాలను సాయంత్రం ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తానికి పద్మశాలి సేవా సంఘం ఎన్నికలతో పట్టణంలోని మార్కండేయ మందిర ప్రాంగణం ఓటర్లతో కళకళలాడింది.