కరోనా దృష్ట్యా రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కొప్పుల - మంత్రి కొప్పుల ఈశ్వర్ సరకుల పంపిణీ
జగిత్యాల జిల్లా బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం పేదలకు నిత్యావసర సరకులు, దివ్యాంగులకు రుణ మంజూరు పత్రాలు అందించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం: కొప్పుల
దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. గోపులాపూర్, బుగ్గారంలో 500 మంది పేద వారికి జడ్పీటీసీ సభ్యుడు బాదినేని రాజేందర్, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పలువురు దివ్యాంగులకు రుణ మంజూరు పత్రాలు అందించారు.
ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!