జగిత్యాల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. జిల్లాలోని మెట్పల్లి, కోరుట్లతో పాటు పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కెట్ యార్డులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అమ్మకానికి తెచ్చిన ధాన్యం నీటిపాలైంది.
రైతులను ముంచిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం - paddy grains collapsed due to heavy rains in jagtial
జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నీటి పాలైంది. మార్కెట్ యార్డుతో పాటు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
మెట్పల్లి మార్కెట్ యార్డులో సుమారు 400 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. చేతికందిన పంట వర్షార్పణం కావడంతో బాధిత రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం