వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు ప్రతి ఒకరు ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని డిమాండ్ చేస్తూ... జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారిపేటకు చెందిన మోతె నరేష్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ నెల 6న వెల్గటూర్‌లో మొదలైన పాదయాత్ర ఈ రోజు జగిత్యాలకు చేరుకుంది. ఆయనతో పాటు జగిత్యాలకు చెందిన డాక్టర్ రవిశంకర్ కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. జగిత్యాల కొత్త బస్టాండ్ తెలంగాణ విగ్రహం వద్ద వారు ధర్నా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగుతుందని వారు తెలిపారు.
సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర - సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర
ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరుతూ జగిత్యాల జిల్లా అంబారిపేటకు చెందిన మోతె నరేష్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రను అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు.
సర్కార్ బడుల్లో చదివించాలని యువకుడి పాదయాత్ర