జగిత్యాల పట్టణంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాలుగా మారిన నిందితుడిని పోలీసులు కటకటాలవెనక్కి నెట్టారు. మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన బోదాసు మహేశ్‌ను అరెస్ట్‌చేశారు. దొంగతనాలు జరిగిన ప్రదేశాల్లో లభించిన సాక్ష్యాల ఆధారంగా కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. రెండున్న తులాల బంగారం, ద్విచక్రవాహనం, చరవాణి స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించిన్నట్లు జగిత్యాల ఏఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. నిందితుడిపై పలు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.
జగిత్యాలలో దొంగ అరెస్ట్ - జగిత్యాలలో దొంగ అరెస్ట్ రెండు తులాల బంగారం స్వాధీనం
జగిత్యాల పట్టణంలో నవంబర్ నెలలో వరుస దొంగతనాలతో కలకలం సృష్టించిన నిందితుడి పోలీసులు పట్టుకున్నారు. రెండున్నర తులాల బంగారం, ద్విచక్రవాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాలలో దొంగ అరెస్ట్