జగిత్యాల జిల్లా కన్నాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తి తగాదాల కారణంగా నిన్న సొంత గ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. కోపం ఎక్కువై కత్తితో తల్లిదండ్రులను చంపేందుకు యత్నించాడు. కానీ సోదరుడు సతీష్ వచ్చి ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే శివకుమార్‌ని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు - తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు
ఆస్తి తగాదాలతో కన్నతల్లిదండ్రులనే హత్య చేసేందుకు యత్నించాడో వ్యక్తి. కానీ అదే తల్లిదండ్రులను కాపాడలనుకున్న ఆయన సోదరుడి చేతిలో బలైపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కన్నాపూర్‌లో చోటు చేసుకుంది.
తల్లిదండ్రులను కాపాడేందుకు తమ్ముడిని చంపాడు