జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. మేడారం జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి సుమారు రెండున్నర గంటల సమయం పడుతోంది.
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. లక్షమందికి స్వామివారి దర్శనం - జగిత్యాల జిల్లా
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఒక్కరోజే లక్షమందికి భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. లక్షమందికి స్వామివారి దర్శనం
ఇప్పటివరకు లక్షమంది భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినా ఏ మాత్రం సరిపోవడం లేదు. భక్తులు ఆలయం వెలుపల వరకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇవీ చూడండి:నేరేడుచర్లలో కాసేపట్లో ఎన్నికలు- కర్ఫ్యూ వాతావరణం
Last Updated : Jan 28, 2020, 3:22 PM IST