జగిత్యాల జిల్లా మెట్పల్లి వద్ద మిషన్ భగీరథ నీరు వృథా అవుతున్న తీరుపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద చెడిపోయిన గేటు వాల్వును అధికారులు పరిశీలించారు. సిబ్బందితో మరమ్మతులు చేయించి మంచినీరు మురుగు కాలువలో కలవకుండా చేశారు.
Response: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. నీటి వృథాను ఆపిన అధికారులు
జగిత్యాల జిల్లా మెట్పల్లి వద్ద గేట్వాల్వ్ చెడిపోయి గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీరు వృథా అవుతోంది. ఈటీవీ భారత్లో ఈ అంశంపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మరమ్మతులు చేయించి వృథాను ఆపారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. నీటి వృథాను ఆపిన అధికారులు
గేట్వాల్వ్ చెడిపోయి 10 రోజుల పాటు తాగునీరు వృథా అయినప్పటికీ... అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. 24 గంటలూ 10 రోజుల పాటు తాగునీరు మురుగు కాలువలో కలుస్తున్న అంశంపై ఈటీవీ బారత్ ఓ కథనాన్ని అందించింది. స్పందించిన అధికారులు మరమ్మత్తులు చేయించారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా