తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాదీ కార్మికులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు - ఖాదీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ నూతన ఛైర్మన్‌గా ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్మికులకు అండగా ఉంటామని... ఇంక్రిమెంట్లు ప్రకటించి తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఛైర్‌పర్సన్‌ దావా వసంత, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

oath ceremony by mla vidya sagar rao at metpally in jagtial
ఖాదీ కార్మికులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు

By

Published : Oct 19, 2020, 1:36 PM IST

ఖాదీ కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ నూతన ఛైర్మన్‌గా ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖాదీ గ్రామోద్యోగ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రకటించి తొలి సంతకం చేశారు.

ఎమ్మెల్యే విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఖాదీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లా ఛైర్‌పర్సన్‌ దావా వసంత అన్నారు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఖాదీ వస్త్రాలను ధరించాలని సూచించారు.

అనంతరం ఆలయంలోని కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు విద్యాసాగర్‌రావును ఘనంగా సన్మానించారు.

ఇదీ చదవండి:నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details