ఇటీవల కాలంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున.. ప్రజలు కొవిడ్ వస్తే అనే ఆలోచన కన్నా.. అది సోకిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని ఊహిస్తూ భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని దుబ్బవాడలో ఓ వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్ రాగా వైద్యులు అతన్ని వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాధి సోకినా లక్షణాలు లేవటూ.. అక్కడి వైద్యులు రోగిని ఇంటికి పంపించారు. ఆ వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంట్లో 12 కుటుంబాలు ఉంటాయని.. అతని వల్ల ఎవరూ వ్యాధి బారిన పడకూడదని.. ఇంటి యజమానికి అతన్ని లోనికి అనుమతించలేదు. ఈ మేరకు ఆ కరోనా సోకిన వ్యక్తి గంటన్నరపాటు రోడ్డుమీద ఉండగా.. చుట్టుపక్కల ప్రజలు అతన్ని వింతగా చూశారు.
కరోనా సోకింది.. ఆస్పత్రి వాళ్లు వద్దన్నారు! ఇంటి యజమాని రావొద్దన్నాడు!! - మెట్పల్లిలో కరోనా రోగి బాధలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని దుబ్బవాడలో ఓ వ్యక్తికి కరోనా రాగా.. అతన్ని ఆసుపత్రిలో చేర్చుకోకపోగా ఇంటికి వెళ్లారు. అక్కడ అద్దెకు ఉంటున్న ఇతన్ని యజమాని అనుమతించకపోవడంతో రోగి పరిస్థితి రోడ్డుపాలైంది. తర్వాత అతన్ని మెట్పల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో అతన్ని ఉంచారు.
కరోనా సోకింది.. ఆస్పత్రి వాళ్లు వద్దన్నారు! ఇంటి యజమాని అనుమతించలేదు!!
రోగిని మరోచోట ఉంచేందుకు పురపాలక అధికారులు గదుల కోసం వెతుకుతూ ఉండగా.. అతన్ని అంబులెన్స్‌లో మెట్పల్లి ప్రభుత్వాసుుత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా రోగిని లోనికి అనుమతించలేదు. అక్కడ మరో అరగంట సేపు వేచి ఉండగా.. ఎట్టకేలకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్ వార్డులో వ్యక్తిని ఉంచేందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్ణయించారు.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స