పురపాలక ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలు సాధింస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 19వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో ఉపసంహరించుకున్నారు.
'పుర ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది' - నామినేషన్ల ఉపసంహరణ
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 19వ వార్డులో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సమక్షంలో ఉపసంహరించుకున్నారు. జరుగబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
'పుర ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది'
నామినేషన్లు వేసిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను అందించారు.
ఇదీ చదవండి:విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్