జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్.. నో పెట్రోల్ నిబంధనను అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుంటే వాహనాల్లో పెట్రోల్ పోయరాదని జిల్లా పాలనాధికారి రవి ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పాటించాలని పౌరసరఫరాల అధికారులు పెట్రోల్ బంకుల యజమానులను హెచ్చరించారు. ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
నో హెల్మెట్.. నో పెట్రోల్.. జగిత్యాల జిల్లాలో అమలు - జగిత్యాల జిల్లాలో నో హెల్మెట్.. నో పెట్రోల్
హెల్మెట్ లేదా.. అయితే మీకు పెట్రోల్ లేనట్లే. పెట్రోలు సీసాల్లో కావాలా.. అయినా లేనట్లే. చిన్న పిల్లలని పెట్రోల్‌కు పంపారా.. వారు ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిందే. ఇదేంటి కొత్త నిబంధనలు అనుకుంటున్నారా! హెల్మెట్ లేకుంటే వాహనాల్లో పెట్రోలు పోయరాదని జిల్లా కలెక్టర్ రవి ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా నేటి నుంచి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
నో హెల్మెట్.. నో పెట్రోల్.. జగిత్యాల జిల్లాలో అమలు
ఎవరైనా హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ పోయకుండా తిరిగి పంపిస్తున్నారు. సీసాల్లోనూ పెట్రోలు పోయరాదని ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలు కోసం చిన్న పిల్లలు ఎవరైనా వచ్చినా.. తిరిగి పంపుతున్నారు. నిబంధనలు పాటించకపోతే పెట్రోల్ బంకుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనపై పోలీసు, పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా ప్రత్యేక దృష్టి సారించాయి.
ఇదీ చూడండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం