జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట.. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశంసించారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని వెల్లడించారు. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించిన సర్పంచ్ నర్సయ్యను అభినందించారు.
ఆ గ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదు - ఎమ్మెల్యే సంకె రవిశంకర్ తాజా వార్తలు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. కాని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. కరోనా కట్టడిలో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆన్నారు. ఆ ఊరి సర్పంచ్, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తను సన్మానించారు.
ఆశా వర్కర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
సర్పంచ్, కార్యదర్శి, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తను శాలువాతో సత్కరించారు. కరోనా కట్టడికి ఏకతాటిపై వచ్చి గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఇతర గ్రామాలు దమ్మయ్యపేటను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తు, భౌతిక దూరం పాటించాలన్నారు. శుభకార్యాలను తక్కువ మందితో చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!