నిజామాబాద్లో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంపై రైతు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ యంత్రాలపై తమకు నమ్మకం లేదని చెబుతున్నా... వాటితో ఎన్నికలు నిర్వహించటం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన నమునా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 64 మంది దాటితే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిబంధన ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు ఓటింగ్ యంత్రాలను వాడుతోందని ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేయాలని రైతులు డిమాండ్ చేశారు.
'నిబంధనలు ఉన్నా... ఈవీఎంలతోనే ఎన్నికలెందుకు' - నిజామాబాద్ ఎన్నికలు
64 మంది దాటితే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిబంధన ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు ఓటింగ్ యంత్రాలను వాడుతోందని నిజామాబాద్ రైతు అభ్యర్థులు ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

nizamabad-farmers
బ్యాలెట్ ద్వారానే నిజామాబాద్ ఎన్నికలు నిర్వహించాలి
ఇదీ చూడండి: ఎన్నికల వాయిదాకై కోర్టుకెక్కిన ఇందూరు రైతులు
Last Updated : Apr 5, 2019, 5:51 PM IST