తెలంగాణ

telangana

'ఆరున్నర ఏళ్లయింది.. రిజర్వేషన్ల సంగతి ఏమైంది'

By

Published : Mar 16, 2020, 5:05 PM IST

రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. నంగారా భేరి, లంబాడా హక్కుల పోరాట సమితి , గిరిజన విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

Nangara samithi protest
అసెంబ్లీ ముట్టడికి నంగారా భేరి యత్నం

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ... నంగారా భేరి, లంబాడా హక్కుల పోరాట సమితి , గిరిజన విద్యార్థి సంఘం అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. శాసనసభకు ర్యాలీగా వస్తున్న సమితి నాయకులను హైదర్​గూడలోనే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

ఆరున్నర ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు గణేశ్​ ఆరోపించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే.. ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీ ముట్టడికి నంగారా భేరి యత్నం

ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details