జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామంలో భూ తగాదాల కారణంగా రెండు వర్గాలు వారు ఘర్షణకు దిగారు. పరస్పరం తిట్టుకుంటూ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలో బక్కశెట్టి గంగారెడ్డి, అతని కొడుకు సతీష్‌ను ఇరుశెట్టి రాజేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు.
భూతగాదాలతో రక్తపాతం.. ఒకరు దుర్మరణం
భూ తగాదాల కారణంగా మొదలైన గొడవ... పరస్పర దూషణల నుంచి కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
కత్తితో దాడి... ఓ వ్యక్తి మృతి... మరో వ్యక్తికి గాయాలు
తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సతీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు