జగిత్యాల జిల్లాలోని ఐదు పట్టణాల్లో పోలింగ్ ప్రశాంతంగా జగురుతోంది. 130 వార్డులు 285 పోలింగ్ కేంద్రాలో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు ఓటేస్తూ స్ఫూర్తిని చాటుతున్నారు. జిల్లా కలెక్టర్ శరత్, పోలీస్ అధికారులు వివిధ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జగిత్యాలలో ప్రశాంతంగా పోలింగ్ - municipal election in jagtial district
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాల్లో ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ శరత్, పోలీస్ అధికారులు పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
జగిత్యాలలో ప్రశాంతంగా పోలింగ్